Tuesday, October 8, 2024

హంస వాహనంపై.. సరస్వతీ దేవి అలంకారంలో సిరుల‌త‌ల్లి..

తిరుపతిరూరల్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు (బుధవారం) రాత్రి హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీ దేవి అలంకారంలో పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. కొవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో అమ్మ‌వారి వాహ‌న‌సేవ ఏకాంతంగా జ‌రిగింది.

వాహనసేవలో పెద్దజీయ‌ర్ స్వామి, చిన్నజీయ‌ర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,  టిటిడి జెఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, సూప‌రింటెండెంట్లు శేషగిరి, మధు, ఏవిఎస్వో వెంకటరమణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజేష్ క‌న్నా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement