Monday, September 25, 2023

KNL: ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య..

అవుకు పట్టణానికి చెందిన చాకలి పెద్ద మదిలేటి (60) అనే వృద్ధుడు ఈరోజు తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ఎంఈఓ కార్యాలయం వెనుక ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిచెందిన వ్యక్తికి గత కొద్ది రోజుల నుండి తాగుడుకు బానిసై మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఘటనకు గల కారణాలను తెలుసుకొని కేసు నమోదు చేస్తామని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement