Thursday, March 28, 2024

తిరుమల కొండపైకి ఎలక్ట్రిక్ బస్సులు.. ట్రయల్ రన్ నిర్వ‌హించిన అధికారులు

తిరుమ‌ల (ప్ర‌భ‌న్యూస్‌): తిరుమల కొండపై కాలుష్యాన్ని నివారించేందుకు ఏపీ ప్ర‌భుత్వం ఎలక్ట్రిక్ బస్సులను న‌డిపించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో ఇవ్వాల (సోమ‌వారం) తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుతో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆర్టీసీ నిపుణులు ఈ బస్సులో ఎక్కి తిరుపతి నుంచి రెండో ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకున్నారు. ఎత్తైన‌ ప్రదేశాలు, మలుపుల వద్ద ఎలక్ట్రిక్ బస్సు పనితీరు ఎట్లుంటుంద‌న్న విష‌యాల‌ను పరిశీలించారు.

ఇక‌.. ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రభుత్వం ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం 100 బస్సులను ఒలెక్ట్రా ఏపీఎస్ఆర్టీసీకి అందించాల్సి ఉంది. ఇప్పటికే పలు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందిన డ్రైవర్లనే ఈ ఎల‌క్ట్రిక్‌ బస్సుల్లో డ్రైవర్లుగా నియమించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement