Saturday, April 20, 2024

ఓబీసీ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు..

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ సవరణ బిల్లుకు వైసీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వైసీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఏయే కులాలు వెనకబాటు తనంలో ఉన్నాయో.. రాష్ట్ర ప్రభుత్వాలకే అవగాహన ఉంటుందన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ ఓబీసీలకు ఈరోజు వరకు పూర్తిగా న్యాయం జరగలేదని రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. సుమారు 67 ఏళ్ల నుంచి ఓబీసీ కేటగిరీ కింద వెనకబడి ఉన్న కులాలకు ఇన్ని సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. వారికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈ బిల్లును తీసుకురావడం మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర గుర్తించలేని ఓబీసీ కులాలు సుమారు 671 ఉన్నాయని, ఈ బిల్లు ద్వారా వారికి ప్రయోజనం చేకూరుతుందన్నారు.

ఇక ఢిల్లీలో విపక్ష పార్టీలు ఓబీసీ బిల్లుకు మద్దతు ప్రకటించడంపూ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ప‌లువురు నేత‌లు పాల్గొన్నారు. రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లుకు ఆమోదం ద‌క్కాలంటే మూడ‌వ వంతు మ‌ద్ద‌తు అవ‌స‌రం. అయితే ఆ బిల్లుకు విప‌క్షాలు మ‌ద్ద‌తు ఇస్తున్న నేప‌థ్యంలో.. బిల్లు పాస్ కావ‌డం అనివార్య‌మే అవుతుంది.

ఇది కూడా చదవండి: RS ప్రవీణ్ కుమార్ కరోనా పాజిటివ్

Advertisement

తాజా వార్తలు

Advertisement