Friday, October 4, 2024

AP | వైన్ షాపుల‌కు నోటిఫికేష‌న్ వ‌చ్చేస్తోంది !

ఏపీలో కొత్త వైన్ షాపుల నోటిఫికేషన్ కు సమయం ఆసన్నమవుతోంది. నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. మ‌రో రెండు – మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. వైన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించేలా గత వైసీపీ ప్రభుత్వం చట్టం చేసిన సంగతి తెలిసిందే.

ఆ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం కోసం ఆర్డినెన్స్ ను రాష్ట్ర గవర్నర్ వద్దకు ప్రభుత్వం పంపనుంది. దీనికి రేపే గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మొత్తం 3,736 షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement