Saturday, July 24, 2021

ఏపీలో నామినేటెడ్ పోస్టుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్‌ పోస్టుల జాబితాను శనివారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రకటించారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలు, వెనకబడిన వర్గాలు, దళితులకు ప్రాధాన్యం ఇచ్చారు. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 55 శాతం పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు.

కాగా, నామినేటెడ్ పదవుల నియామకంలో కొత్త విధానానికి సీఎం జగన్ తెర తీశారు. రాష్ట్రస్థాయిలో జోడు పదవుల విధానానికి బ్రేక్ వేశారు. కొందరు ఎమ్మెల్యేలకు ఇచ్చిన అదనపు పదవులను రద్దు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నామినేటెడ్‌ పదవులు అలంకార ప్రాయం కాదని.. పదవులు తీసుకున్నవారు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. పదవుల భర్తీలో సీఎం సామాజిక న్యాయం పాటిస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు ఇచ్చామని సజ్జల వివరించారు.

నామినేటెడ్‌ పోస్టుల వివరాలు..


సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌గా గేదెల బంగారు
గ్రంథాలయ ఛైర్‌ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి

జిల్లాల వారీగా..

శ్రీకాకుళం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు

విజయనగరం జిల్లాలో 7 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు

విశాఖ జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు

ప.గో జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు

తూ.గో జిల్లాలో 17 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 9 పోస్టులు

కృష్ణా జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు

గుంటూరు జిల్లాలో 9 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు

ప్రకాశం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు

నెల్లూరు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు

కడప జిల్లాలో 11 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 6 పోస్టులు

కర్నూలు జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు

అనంతపురం జిల్లాలో 10 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 పోస్టులు

చిత్తూరు జిల్లాలో 12 పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 7 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News