Thursday, April 25, 2024

నో వెయిటింగ్‌.. భ‌క్తుల‌కు అందుబాటులోనే, ఆన్‌లైన్‌లో అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ‌ టోకెన్లు!

తిరుమల : తిరుమ‌ల శ్రీ‌వారి అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టోకెన్ల‌ను జూన్ 15వ తేదీ నుండి కరెంటు బుకింగ్ స్థానంలో ఆన్‌లైన్‌లో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచ‌నున్నారు. ఈ టికెట్లు పొందేందుకు ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి భక్తులు సౌక‌ర్యార్థం ఇక‌పై టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టోకెన్లు విడుద‌ల చేయ‌నుంది.

ఇందులో భాగంగా జూన్ 15వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు.. జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వ‌ర‌కు రోజుకు 750 టోకెన్ల చొప్పున ఆన్‌లైన్‌లో జారీ చేస్తారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అంగ‌ప్ర‌ద‌క్ష‌ణ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement