Thursday, March 28, 2024

ఆద్దెలు పెర‌గ‌వు…ఆదాయం పెర‌గ‌దు..

అమరావతి,ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో ప్రభుత్వానికి సం బంధించిన స్థలాలు, విలువైన భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు లెక్కకు మించి ఉన్నప్పటికీ ప్రభు త్వానికి మాత్రం ఆ దిశగా ఆదా యం సమకూరడం లేదు. ఆస్తు లు బోలెడు ఉన్నా..అరకొర అద్దె లు వేలం డబ్బులతోనే ప్రభుత్వం సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు సమీపంలోనే ఉన్నా ప్రైవేటు భవ నాలకు ప్రతీ ఏటా లక్షల్లో ఆదాయం సమకూ రుతున్నా, ప్రభుత్వ భవనాలకు మాత్రం వేలల్లోనే ఆదాయం పరిమితం కావడం పలు సందేహాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ, ఆర్‌అండ్‌ బీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల పరిధిలో దాదా పుగా అన్ని పట్టణ ప్రాంతాల్లో విలువైన భవనాలు, స్థలాలు ఉన్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో అయితే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ, దేవాల యానికి సమీపంలోనూ ఖాళీ స్థలాలు, షాపింగ్‌ కాం ప్లెక్స్‌లు భారీగా ఉన్నాయి. వాటి ద్వారా ప్రతీ ఏటా
ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తుంది. అయితే దశాబ్దాలుగా ఆయా స్థలాలు, భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు వేలం ద్వారా లీజుకు ఇచ్చే ప్రక్రియలో క్రింది స్థాయిలోనే అధికారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా రు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు రావల సిన అద్దెలు, లీజు సొమ్ము పక్కదారి పడుతుంది. వాటికి సమీపంలో ఉండే ప్రైవేటు భవనాలకు చెల్లిస్తున్న అద్దెల్లో కనీసం 30 శాతం కూడా ప్రభుత్వ స్థలాలకు చెల్లించడం లేదంటే రాష్ట్రంలో ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందో స్పష్టంగా అర్ధమవుతుంది.

సంవత్సరాల తరబడి..పాత అద్దెలే
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్తులకు సంబం ధించిన స్థలాలు, భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల అద్దెల విషయంలో సంవత్సరాల తరబడి పాత విధానమే అమలవుతుంది. పేరుకు కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నా..కొంతమంది అధికారులు మాత్రం పాత పద్దతిలోనే తమకు అనుకూలంగా ఉన్న వారికి దారాదత్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో సంవత్సరాల్లో కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే మొక్కుబడిగా కొన్ని ప్రాంతాల్లో అద్దెలు పెంచారే తప్ప మిగిలిన ప్రాంతాల్లో పాత అద్దెలే వసూలు చేస్తున్నారు. పొరపా టున ఎక్కడైనా ధరలు పెంచినా మరమ్మ త్తులు, ఆధునీకరణ పేరుతో ఆ సొమ్మును కూడా పక్కదారి పట్టించేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి అరకొర అద్దెలే అందుతున్నాయి. వాస్తవానికి ఆయా శాఖల పరిధి లోని ఆస్తులకు సంబంధించిన అద్దె సొమ్ములు ఆయా శాఖల నిర్వహణకు ఉపయోగిం చుకోవాలి. అందుకు సంబంధించి ప్ర భుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఆదాయం పెరిగితే ఎక్కడ ఆ యా దేవాలయాలకు సంబంధించి గ్రేడ్‌లు మారు తాయోనన్న భయంతో కొంతమంది దేవాదాయ శా ఖ అధికారులు ముందుచూపుతో ఆదాయాన్ని తగ్గిం చి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే షాపింగ్‌ కాంప్లెక్స్‌ల అద్దెలు, ఖాళీ స్థలాల లీజు సొమ్ములు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రభు త్వానికి సంబంధించిన స్థలాలకు సమీపంలోనే ప్రైవే టు వ్యక్తులకు చెందిన భవనాలు, స్థలాలు ఉన్నాయి. వాటికి నెలకు చెల్లిస్తున్న అద్దెలు, ప్రభు త్వానికి సంబంధించిన ఆస్తులకు ఏడాది పొడవునా కూడా ఆ స్థాయిలో అద్దెలు అందడం లేదంటే దోపిడీ ఏ స్థాయి లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం ఆయా శాఖల అధికారులకు తెలి సినా సొంత జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రభుత్వ ఖజానాకు కొంతైనా ఆదాయం పెరిగే ప్రయత్నం చేయలేకపోతున్నారు. లోటు బడ్జెట్‌ లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఆర్ధికంగా మరింత ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్తులపై ప్రతీ ఏటా వస్తున్న రాబడులపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవ సరం ఎంతైనా ఉంది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేస్తే ఫలితం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement