Saturday, April 20, 2024

నేను ఎంపీగా ఉన్నా-లేక‌పోయినా విజ‌య‌వాడ‌కేం న‌ష్టం లేదు- కేశినేని నాని

తాను ఎంపీగా ఉన్నా లేక‌పోయినా విజ‌యవాడ‌కి వ‌చ్చిన న‌ష్టం ఏం లేద‌న్నారు కేశినేని నాని.టిడిపి పార్టీలో ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై కేశినేని నాని మాట్లాడుతూ… తాను అసంతృప్తిగా లేనని చెప్పారు. తనపై మీడియా అనవసరంగా ఫోకస్ చేస్తోందని అన్నారు. తన లాంటి నానిలు లక్ష మంది పుట్టుకొస్తారన్నారు. తన ఎంపీ స్టిక్కర్ కేవలం తన కారుపై మాత్రమే ఉంటుందని… ఆ కారులో తన కూతురును కూడా తిరగనివ్వనన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో అంశం ప్రైవేట్ వ్యవహారం కాదని… అది మహిళలకు సంబంధించిన విషయమని చెప్పారు. రాజకీయ నాయకులు చాలా క్లీన్ గా ఉండాలని అన్నారు. స్వాతంత్ర్యం రావడానికి ముందు మన దేశ పరిస్థితి చాలా దారుణంగా వుండేదని… ఇప్పుడు అన్ని విధాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. విజయవాడలోని కేశినేని భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను నాని ఎగురవేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement