Tuesday, March 26, 2024

కోవిడ్ కేర్ సెంటర్లలో బాధితుల ఆకలి కేకలు

నంద్యాలలో బాధితుల నిరసన.
. వెళ్లకు భోజనం పెట్టడం లేదని ఆరోపణ.
. నాణ్యతగా ఉండటం లేదనీ ఆవేదన.
.అన్ని సక్రమంగా ఉన్నాయంటూ అధికారుల వాదన.
కర్నూల్ బ్యూరో, -.కర్నూలు జిల్లాలో మహమ్మారి కరోనా వేగంగా వ్యాపిస్తుంది. మొదటి వేవ్ కన్నా రెండో వేవ్ లో తీవ్రంగా ఉంది. వైరస్ మూలంగా ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడి ఆసుపత్రి పాలు అవుతున్నారు. అయితే కరోనా సోకినా వ్యక్తులకు ముఖ్యంగా పౌష్ఠిక ఆహారం తీసుకోవడం ద్వారా వైరస్ నుంచి బయట పడేందుకు అవకాశం ఉందని వైద్యు వర్గాలతోపాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ బాధితులకు ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అందులో ప్రజలకు చికిత్సతో పాటు పౌష్ఠిక ఆహారం అందిస్తుంది. ముఖ్యంగా పౌష్టికాహారం అందజేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కాంట్రాక్టర్ లను నియమించి అధికారుల నేతృత్వంలో నాణ్యమైన భోజల వసతులు కల్పిస్తోంది. అయితే కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన భోజనాల మాటేమో కానీ .. రోగుల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. నిన్నటికి నిన్న ఆదోని పట్టణ శివారులోని టిడ్కో నివాసాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ కేంద్రంలో భోజనం సక్రమంగా అందక దాదాపు రెండు వందల మంది వైరస్ బాధితులు రోడ్డెక్కిన సంగతి విధితమే. తమకు పూర్తిస్థాయిలో ఆహారం అందడంలేదని, నాసిరకం భోజన వడ్డనతో తాము తినలేకపోతున్నామని ఈ సందర్భంగా వైరస్ బాధితులు తమ బాధను వ్యక్తం చేశారు.
ప్రధానంగా మెనూలో సూచించిన మాంసం, గుడ్డు, పండు, పాలు, రాగి జావ, బిస్కెట్లు వంటివి అస్సలు ఇవ్వడం వైరస్ బాధితులు వాపోవడం జరిగింది. సరిగ్గా వారం క్రితం జరిగిన మానవత్వం ఉన్న వారందరికీ కదిలించ గా,, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్వయంగా ఆదోని కోవిడ్ కేర్ సెంటర్ ను తనిఖీ చేసి కేర్ఫుల్ గా ఉండాలని అక్కడి సిబ్బంది హెచ్చరించారు. అయినా జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్లలో పరిస్థితిలో మార్పు లేదు.. నిన్నటికి నిన్న ఆదోనిలో ఘటనలు చోటు చేసుకోగా… తాజాగా నంద్యాల comrade కేర్ సెంటర్ లో వైరస్ రోగుల ఆకలి కేకలు మిన్నంటాయి.
బుధవారం కరోనా రోగులు ఆకలితో అలమటించారు. అదిగో…ఇదిగో తెస్తారన్న ఆశతో రోజంతా ఎదురు చూశారు. ఉదయం అల్పాహారం… మధ్యాహ్న భోజనం పంపిణీ చేయకపోవడంతో ఖాళీ కడుపులతో విలవిల్లాడారు. ప్రైవేట్ గా ఏదొక ఆహారాన్ని తెప్పించుకోడానికి కూడా వీలులేని దయనీయ పరిస్థితి వారిది. నంద్యాల టిడ్కో కేంద్రంలో కొవిడ్తో వైద్య చికిత్స పొందుతున్న 440 మంది రోగుల హృదయ విదారకమైన దుస్థితి ఇది.

అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్వాకం మూలంగా కరోనా రోగులు కడుపు మార్చుకోవాల్సి వచ్చింది. నంద్యాల టిడ్కో ఇల్లు నివాసాల్లో దాదాపు 400 మందికి పైగా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరికి మూడు పూటలా అల్పాహారం, భోజనం, మధ్యలో స్నాక్స్… వంటి ఆహారాన్ని అందించే బాధ్యత జిల్లా అధికారులు తీసుకున్నారు. రోగులకు ఆహారం, అల్పాహారం అందించే బాధ్యతను కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు, హోటల్ యజమానులకు అప్పగించారు. వాస్తవంగా కోహ్లీ కేర్ సెంటర్ లో మెనూ ప్రకారం ఆహారం అందించాల్సి ఉండగా,బుధవారం ఉదయం 10 గంటల సమయంలో అరకొర పొంగల్ ప్యాక్ చేసిన ఓ ఇరవై మందికి అల్పాహారం ఇచ్చారు. మిగతా వారికి ఇవ్వలేదు. ఇక భోజనం పూర్తిగా ఇవ్వలేదు. అన్నిచోట్లా ఇదే దుస్థితి నెల కొంది. దీంతో ఆగ్రహించిన వైరస్ బాధితులు అక్కడి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ వారిపైకి ఎగబడ్డారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కోవిడ్ బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం గమనార్హం. దీంతో రోగులు పోలీసులు కూడా గోడు వెళ్లబోసుకున్నారు. అల్పాహారం, భోజనం పెట్టలేదంటూ రోగులు మొర పెట్టుకున్నారు. టిఫిన్ పెట్టలేదు. భోజనం తేలేదు. తామంతా ఆకలితో ఇబ్బంది పడుతున్నామంటూ కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆయన ఆరా తీశారు. సాయంత్రం 4 గంటలకు కొంత మందికి హోటళ్ల నుంచి భోజన ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఈ ప్యాకెట్లు సైతం అపరిశుభ్రతతో ఉన్నాయి. కొన్ని ప్యాకెట్లలో దోమలు, ఈగలు కనిపించాయి. విధిలేక ఆకలి తట్టుకోలేక అదే భోజనాన్ని తిన్నట్లు రోగులు వాపోయారు. అంతేకాదు కో వీడు సెంటర్లలో
సరైన వసతులు లేక…కరోనాకు వైద్యం అందించే వారు లేక దీన స్థితిలో గడుపుతున్నట్లు వాపోయారు. వాస్తవంగా కరోనా భారిన పడ్డ ప్రజలు. కరోనా నిర్ధారణ అయిన తరువాత నంద్యాల ,కర్నూలు, ఆదోని కోవిడ్ కేర్ సెంటర్లకు నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత కేర్ కేంద్రాలకు తాళాలు వేశారని, కనీసం కోవిడ్ వైరస్ కు మందులు, మాత్రలు కూడా ఇచ్చే నాధుడే లేరన్నది రోగుల ఆవేదన. రాత్రి 10 గంటలకు నాణ్యత లేని ఆహారాన్ని అందించినా అవి ఏమాత్రం మాకు సరిపోవడం లేదని సెల్ఫీ వీడియోలో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాత్రంతా, తీవ్ర దగ్గు, జ్వరంతోనే బాధపడుతూ ఉన్నామని కనీసం వైద్యం అందించే వారు లేరని కన్నీరు పెట్టుకున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి కరోనా సోకి క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారికీ నాణ్యమైన భోజనం సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను బాధితులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement