Wednesday, April 24, 2024

ఆస్తి కోసం హ‌త్య …హెచ్ ఆర్ సి ఆశ్ర‌యించిన విద్యార్ది..

గుంటూరు – త‌న ఆస్తి కోసం త‌న బంధువులే చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని, త‌న‌ను ర‌క్షించాల‌ని కోరుతూ తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్ధి మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ఆశ్ర‌యించాడు.. వివ‌రాల‌లోకి వెళితే పల్నాడుకి చెందిన విద్యార్ధి డెవిడ్ కు చిన్న‌త‌నంలోనే త‌ల్లి మ‌ర‌ణించింది.. అయితే అత‌డిని చేర‌దీసి పెంచి పెద్ద చేశారు మేన‌మామ‌,మేన‌త్త‌.. అయితే త‌న త‌ల్లి ద్వారా త‌న‌కు సంక్ర‌మించిన ఆస్తిని కాజేసేందుకు మేన‌త్త‌,మేన‌మామ లు త‌న‌ను చంపాల‌ని చూస్తున్నార‌ని మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ లో ఫిర్యాదు చేశాడు.. తల్లి నుంచి సంక్రమించిన ఆస్తిని తన మేనమామ భార్య, అతని కుటుంబ సభ్యులు కాజేయడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు .

కూలి పనులు చేయిస్తూ అన్నం కూడా సరిగా పెట్టకుండా వేధించేవారని త‌న గోడును క‌మిష‌న్ ముందు వెళ్ల‌బోసుకున్నాడు. . తాను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నానని.. అనాథగా ఉన్నా తనకు ఇబ్బంది లేదని, కానీ, తన జోలికి వాళ్లు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు.. ఇదే వ్యవహారంలో గతంలో పోలీసులు ఆశ్రయించాడు డేవిడ్.. అయితే, ఆ తర్వాత కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయని అంటున్నాడు.. అందుకే ఇప్పుడు మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించానని చెబుతున్నాడు. దీనిపై మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ బాధిత స‌భ్యుడు అరోపిస్తున్న కుటంబ స‌భ్యుల‌ను విచారించి నివేదిక స‌మ‌ర్పించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement