Friday, April 19, 2024

NIA searches: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని మాజీ మావోయిస్టు రవిశర్మ, అనురాధ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడుగా పనిచేసి రవిశర్మ.. ఇటీవల కాలంలో లొంగిపోయారు. ప్రకాశం జిల్లాలో విరసం నేత కళ్యాణ్ రావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. మావోయిస్టు పార్టీ చర్చల ప్రతినిధిగా కొనసాగిన కళ్యాణ్ రావు ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మృతిచెందిన మావోయిస్టు అగ్ర నేత ఆర్కే జీవిత చరిత్రపై పుస్తకం ప్రచురణపై కూడా ఎన్‌ఐఏ ఆరా తీస్తున్నట్టుగా సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement