Thursday, April 25, 2024

పాపికొండలు సందర్శనకు కొత్త టూర్‌ ప్యాకేజీ.. ప్రకటించిన టూరిజం డిపార్ట్​మెంట్​

అమరావతి, ఆంధ్రప్రభ: పాపికొండలు సందర్శించే పర్యాటకులకు ఏపీ పర్యాటక శాఖ కొత్త టారిఫ్‌లు ప్రకటించింది. వేర్వేరు పర్యాటక ప్రాంతాల నుంచి పాపికొండలు సందర్శించే పర్యాటకుల కోసం ఒక రోజు, రెండు రోజుల ప్యాకేజీ ప్రకటించడంతో పాటు వారికి అందించే సౌకర్యాలను సైతం స్పష్టం చేసింది. రాజమండ్రి నుంచి ఒక రోజు పర్యటనకు పెద్దలకు రూ.1,250, పిల్లలకు రూ.1,050 కాగా రెండు రోజుల పర్యటనకు పెద్దలకు రూ.3000, పిల్లలకు రూ.2,500గా నిర్ణయించారు.

పోచవరం నుంచి పాపికొండలు ఒకరోజు సందర్శనకు పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750, రెండు రోజుల ప్యాకేజీగా పెద్దలకు రూ. 2,500, పిల్లలకు రూ.2000, గండిపోచమ్మ గుడి నుంచి పాపికొండలు వెళ్లే పర్యాటకులకు పెద్దలకు రూ.1000, పిల్లలకు రూ.800 కాగా రెండు రోజుల పర్యటనకు పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2000గా పర్యాటక శాఖ పేర్కొంది.

రాజమండ్రి నుంచి ఉదయం 7.30గంటల నుంచి సాయంత్రం 7.30గంటలకు, పోచవరం నుంచి ఒక రోజు పర్యటన ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, రెండు రోజుల పర్యటన ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 7.30గంటలు కాగా గండిపోచమ్మ గుడి నుంచి ఒక రోజు సందర్శన ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, రెండు రోజుల పర్యటన ఉదయం 7.30గంటల నుంచి రాత్రి 7.30గంటలుగా నిర్ణయించారు.

- Advertisement -

ఒక రోజు సందర్శనలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాఖాహార భోజనం, సాయంత్రం స్నాక్స్‌ కాగా రెండు రోజుల పర్యటనకు వెళ్లే సందర్శకులకు ఒక రోజు సందర్శకులకు మాదిరిగానే ఆహార సదుపాయాలు ఉండగా తొలి రోజు రాత్రి, మరుసటి రోజు మధ్యాహ్నం మాత్రం మాంసాహార భోజనం ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ డివిజినల్‌ మేనేజర్‌ తెలిపారు. పాపికొండలు సందర్శనకు వెళ్లే పర్యాటకులు 98486 29341, 98488 83091 నంబర్లలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement