Saturday, April 20, 2024

Breaking: ఏపీలో బార్లకు కొత్త పాలసీ.. సెప్టెంబర్​ 1 నుంచి అమల్లోకి

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం పాలసీ సిస్టమ్​ మారిపోయింది. తాజాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలోని బార్లకు కొత్త పాలసీ ప్రకటించింది ప్రభుత్వం. పట్టణ ప్రాంతాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల పరిధిలో ఎన్ని బార్లు ఉండాలన్నది ఎక్సైజ్ కమిషనర్ నిర్ణయిస్తారు.

ఇక.. మున్సిపల్ కార్పొరేషన్ లో 10 కిలోమీటర్ల పరిధిలో, మున్సిపాలిటీల్లో 3 కిలోమీటర్ల పరిధిలో బార్లు ఏర్పాటు చేసుకోవడానికి చాన్స్​ కల్పించారు. ఇది మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్లకు లైసెన్సులు ఉండనున్నాయి. బార్లకు లైసెన్స్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ చార్జీలు ఏడాదికి 10 శాతం పెంచింది ప్రభుత్వం. కాగా, కొత్త బార్ పాలసీ సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానుంది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు వెలువరించారు. ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను మరో రెండు నెలల పాటు పొడిగించారు. వాస్తవానికి బార్ల లైసెన్సులు ఈ నెలాఖరుతో ముగియనున్నాయి. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో, బార్ల లైసెన్సుల కాలపరిమితి జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు. లైసెన్సులు పొడిగించిన కాలానికి ప్రభుత్వం ఈ నెల 27న బార్ల నుంచి ఫీజులు వసూలు చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement