Friday, April 26, 2024

నష్టానికి పొగాకు అమ్మాల్సిం దేనా? – అధికారుల ముందు రైతుల గోడు..

మర్రిపాడు – రైతులు పొగాకును పండించేందుకు పడిన కష్టాలు అన్ని ఇన్నీ కావు. రైతులు పండించిన పొగాకు పంట నే కాకుండా తమ శ్రమను కూడ దోచుకుంటున్నారని ఇంకా ఎన్నాళ్లీ దాష్టికం అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. రైతులు నష్టానికి పొగాకు అమ్ముకోవాల్సిన దుస్థితి వ‌చ్చింద‌ని అయ్యో రామచంద్ర అంటూ రైతులు విలవిలలాడిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి ఆరు నెలలు వెట్టి చాకిరీ చేసి చివరికి పొగాకు పంటను పండిస్తే వ్యాపారస్తులు అధికారులు రాబందుల్ల తమ పొగాకును లాక్కుంటున్నారేతప్ప కష్టపడి పండించిన రైతులకు కనీసం శ్రమ కు దగ్గ ఫలితం ఇవ్వాలన్నా ఇంకిత జ్ఞానం కూడా అధికారుల్లో లేకపోవడం బాధాకరమని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులు నిబంధన ప్రకారం పొగాకు పంట ను తప్పనిసరిగా సాగు చేయాలని లేకపోతే తే లైసెన్స్ రద్దు చేస్తామని బలవంతంగా పొగాకు పంట వేయించార‌ని అన్నారు. తమ లాభాల కోసం సాగు చేయించి ఈ ఏడాది మంచి ధర వస్తుందని హామీలు గుప్పించి పంటను సాగు చేసే వరకు కల్లబొల్లి మాటలు చెప్పి తీరా పంట పండించిన తర్వాత గిట్టుబాటు ధ‌ర కూడా చెల్లించ‌డం లేద‌ని అధికారుల‌కు మొర‌పెట్టుకున్నారు. వారు చెప్పిందే వేదం నిర్ణయించిందే ధర అన్నట్లు వ్యాపారస్తులు వేలం అధికారి ఒకే మాటపై ఉంటూ రైతులను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎక్కువ రోజులు ఉండే కొద్ది పొగాకు రంగుమారి చెడిపోయే ప్రమాదం ఉండడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పొగాకును నష్టానికి అమ్ముకుంటున్నామని కంట తడిపెడుతున్నారు. వారిని ఆదరించే వారు కనిపించడం లేదని నిరాశ చెందుతున్నారు. ఈ విషయంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరొకసారి బోర్డు అధికారులతో మాట్లాడి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే ఈ ఏడాది తోనే పొగాకు పంట సాగు ను ఆపేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందని రైతులు వాపోతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement