Thursday, June 1, 2023

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్మికులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. రహదారి మరమ్మతు పనులు చేస్తున్న కార్మికులపై లారీ దూసుకెళ్లడంతో ప్ర‌మాదం చోటుచేసుకున్న‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని వివ‌రాలు సేక‌రించారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement