Tuesday, April 23, 2024

మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు

కొండాపురం మండలం మోడల్ పాఠశాల లో ఆరవ తరగతి ప్రవేశానికి 2021 .2022 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో చేరేందుకు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ కె . వి ఖాదర్ భాష తెలిపారు. ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2019 , 2020 ,2020 ,2021, లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పాఠశాల లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఏప్రిల్ 16 నుంచి మే 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ప్రింట్ కాపీ ని సంబంధిత కళాశాలలో అందజేయాలన్నారు ఓ సి, బి సి ,లు వంద రూపాయలు ఫీజు చెల్లించాలన్నారు ఎస్సీ ఎస్టీలు 50 రూపాయలు ఫీజు చెల్లించాలన్నారు మండలంలోని ఐదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement