Friday, May 7, 2021

కోవిడ్ నివారణకు ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

ప్రతీ రోజు మూడు అంకెల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు
జిల్లాలో 9 కోవిడ్ టెస్ట్ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు
జిల్లాలో ఉన్న టీడ్కో భవనాల్లో కోవిడ్ క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు
ప్లాస్మా దాతృత్వం పై దృష్టి
కోవిడ్ సోకి తగ్గిన యువత ప్లాస్మా రక్తదానం చేయాలి
కోవిడ్ నియంత్రణ కు కఠిన చర్యలు
బుధ‌వారం నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది
ఉదయం 6-12 గంటల వరకు 144 సెక్షన్‌

గూడూరు ఇక కరోనా కట్టడికి అన్నిచర్యలుతీసుకుంటుమన్నారు జిల్లా కలెక్టర్ కె .వి ఎన్. చక్రధర్ బాబు తెలిపారు. మంగళవారం గూడూరు పట్టణ పరిధిలోని గాంధీ నగర్ సమీపంలో ఉన్న టీడ్కో భవనాల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్,క్వారం టైన్ కేంద్రాలనుజిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు, గూడూరు సబ్ కలెక్టర్ రోనంఖి గోపాలకృష్ణ అధికారులతో కలసి పరిశీలించారు,అక్కడ రోగులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు తో పాటు అందుతున్న వైద్య సదుపాయాలు గురుంచి గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ను అడిగి తెలుసుకున్నారు,ఈసందర్భంగా కలెక్టర్ చక్రధర్ బాబు, మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం నెల్లూరు జిల్లాలో మే 5 నుంచి పాక్షిక కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 6-12 గంటల వరకు మాత్రమే దుకాణాల​కు అనుమతి.. మధ్యాహ్నం 12 తర్వత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఉదయం 6-12 గంటల వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసర సేవలకు ఎప్పటిలానే అనుమతి ఉంటుందన్నారు.
జిల్లాలో ప్రతీ రోజు మూడు అంకెల కోవిడ్ కేసులునమోదు అవుతున్న తరుణంలో జిల్లాలోకరోనా కట్టడికి అన్నిచర్యలు తీసుకుంటుమన్నారు. ప్రస్తుతం జిల్లాలో పలు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సజరుగుతోంది.. 9 కోవిడ్ కేర్ సెంటర్స్ జిల్లాలో ఉన్నాయి అని తెలిపారు. జిల్లాలో ఆస్పత్రులకు ఆక్సిజన్‌ కొరత లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్న తరుణంలో దాతలు కూడా ఆక్సిజన్ సిలెండర్లు అందిస్తున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆక్సిజన్ సరఫరా కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర అధికారులతోమాట్లాడుతున్నామని.. కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లనుపెంచుతున్నామన్నారు . కోవిడ్ నియంత్రణకు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షనిర్వహించారన్నారు.
కరోనా వ్యాధి నుంచి కోలుకున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయడం వల్ల మరెంతో మంది ప్రాణాలను కాపాడినవాళ్లవుతారు. కాబట్టి ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి’’ అని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతపరిస్థితుల్లోఒకరికొకరం తోడుగా ఉండటం ఎంతో అవసరం అని… కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్లాస్మా థెరపీ ప్రాణాలను నిలబెట్టడానికిఎంతగానోఉపయోగపడుతోందన్నారు.
ఇప్పటికే జిల్లాలో ఉన్న టీడ్కో భవనాల్లో కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు, గూడూరు టీడ్కో భవనం లో ఉన్న కోవిడ్ సెంటర్ లో కోవిడ్ రోగుల కోసం 500 పడకలు సిద్ధంగా ఉన్నట్టు రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు,కోవిడ్ రోగులకు అన్నీసౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ అధికారులకు ఆదేశాలుజారీచేసినట్లు తెలిపారు,ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ అచ్యుత్ కుమారి,గూడూరుమున్సిపల్ ఇంచార్జి కమిషనర్, ఏరియా ఆసుపత్రి సూపర్ డేంటెంట్ రామకృష్ణ, రెవెన్యూ, వైద్య అధికారులు మరియుసిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News