Sunday, October 6, 2024

మొలక పోలేరమ్మ జాతర మహోత్సవంలో.. మంత్రి కాకాణి

ముత్తుకూరు ( ప్రభ న్యూస్) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామపంచాయతీ రాంనగర్ లో చివరి రోజు జరిగిన మొలకపోలేరమ్మ జాతర మహోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరై అమ్మవారి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కృష్ణపట్నం గ్రామపంచాయతీ రామ్ నగర్ లో జరిగిన శ్రీరామనవమి, మొలకపొలేరమ్మ జాతర మహోత్సవాలు ఆదివారం నాటికి ముగిసినవి. చివరి రోజు జాతర మహోత్సవానికి మంత్రి కాకాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ కాపులు అక్కయ్య గారి నరసింహ, కోడి సుబ్రహ్మణ్యం, కొండూరు జయరామయ్య, మేకల సుబ్రహ్మణ్యం, ప్రళయ కావేరి సుబ్రహ్మణ్యం, మేకల నవీన్ గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్రీరాముని ఆలయంలో మంత్రి పూజా కార్యక్రమం నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. నేపథ్యంలో గ్రామ కాపులు మంత్రికి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం గురించి మంత్రి మాట్లాడారు. జాతర మహోత్సవంలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. గ్రామ ఆరాధ్య దైవాలు ఆశీస్సులతో మత్స్యకార కుటుంబాలు సుఖశాంతులతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్టావిష్ణువర్ధన్ రెడ్డి , స్థానిక ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, గ్రామ సచివాలయాల కన్వీనర్ శివప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ గుడి ఉదయభాస్కర్ రెడ్డి, తోటపల్లి గూడూరు మండల పార్టీ నాయకులు తూపిలి శ్రీధర్ రెడ్డి , గ్రామ సచివాలయం డిడిఓ రాజశేఖర్, పోలీస్ శాఖ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement