Monday, March 25, 2024

అది ఫోన్ ట్యాపింగ్ కాదు.. రికార్డింగే.. రామశివారెడ్డి

గత కొన్ని రోజులుగా వైసీపీని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి స్పందించారు. కోటంరెడ్డి మాట్లాడిన ఆడియోను రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని.. కేవలం ఫోన్ అటోమెటిక్ రికార్డింగేనని రామశివారెడ్డి క్లారిటీనిచ్చారు. ఓ కాంట్రాక్టర్ విషయంలో కోటంరెడ్డి తనతో మాట్లాడారన్నారు. అది ఫోన్ లో అటోమెటిక్ గా రికార్డు అయిందన్నారు. ఇదే విషయాన్ని తమ స్నేహితుల వద్ద వివరించానని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇంత చిన్న విషయానికి రాష్ట్రం ప్రభుత్వంపై ఆరోపణలు వస్తాయని తాను ఊహించలేదని రామకృష్ణారెడ్డి అన్నారు. కోటంరెడ్డి ట్యాపింగ్ ఆరోపణలను రామ శివారెడ్డి ఖండించారు. అది ట్యాపింగ్ కాదని.. తన ఫోన్ ను కేంద్ర హోంశాఖకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement