Friday, April 19, 2024

26న పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ఈనెల 26న పీఎస్‌ఎల్‌వీ సీ-54 ప్రయోగం చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సిద్ధ‌మైంది. ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని స్పేస్‌సెంటర్‌ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నది. ఓషన్‌శాట్‌-3 సహా ఎనిమిది నానో ఉపగ్రహాలను సీ-54 రాకెట్‌ కక్షలో ప్రవేశపెట్టనున్నది. శనివారం ఉదయం 11.56 గంటలకు ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. ఓషన్‌శాట్‌-3తో పాటు భూటాన్ శాట్, ఆనంద్, ధ్రువ స్పేస్ నుంచి రెండు టైబోల్ట్ శాటిలైట్లను, నాలుగు ఆస్ట్రోకాస్ట్ శాటిలైట్లను ఇస్రో నింగిలోకి పంపనున్నది. ఓషన్‌శాట్‌ భూ పరిశీలన ఉపగ్రహం కాగా.. ఇప్పటికే ఓషన్‌శాట్ సిరీస్‌లో ఓషన్‌శాట్-1, ఓషన్‌శాట్-2 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో మూడో ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement