Wednesday, March 27, 2024

తోపుడుబండ్లకు వ్యాపారస్తుల వేధింపులు..

బుచ్చిరెడ్డిపాలెం : రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారివి, ఉదయం నుండి సాయంత్రం వరకు తోపుడు బండి పై వ్యాపారం చేస్తూ ఎండనక వాననక కష్టపడుతుంటారు. వచ్చిన దానితో కుటుంబ పోషణకు చాలక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆపాన హస్తం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఓ పక్క తోపుడు బండి పై కూరగాయలు పండ్లు ఇతర సామాగ్రి పెట్టి అమ్ముకుంటూ అందులో వచ్చిన ఆదాయం నష్టాలను భరిస్తూ ఎలాగా జీవిత ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో వందకు పైగా తోపుడు బండ్లు ఉంటాయి. ప్రతిరోజు వారు వ్యాపారం చేసుకునేందుకు నగర పంచాయతీ వేలంపాట పాడుకున్న వారికి 20 నుండి 30 రూపాయలు చెల్లిస్తూ ఉంటారు. ఇంతవరకు న్యాయబద్ధంగా ఉన్న వారికి వ్యాపారస్తులు అదనపు వసూళ్లు చేస్తూ చిరు వ్యాపారస్తుల నడ్డి విరుస్తూ ఉన్నారు. చెన్నూరు ముంబై రోడ్డు వెంబడి పెద్ద దుకాణాల ముందర బండ్లపై వ్యాపారం చేసుకునేందుకు ఆయా దుకాణాల యజమానులకు ఒక్కో తోపుడు బండికి రూ.100 నుండి రూ.500 వరకు సమర్పించాల్సి వస్తోంది. ఉదయము నుండి అనంతరం వరకు వ్యాపారం చేస్తే వారికి వచ్చే ఆదాయమే అంతంత మాత్రం. కుటుంబ పోషణ చేయాలా లేక వ్యాపారులకు అడిగినంత ఇవ్వాలో అర్థం కాక చిరు వ్యాపారస్తులు కుంగిపోతున్నారు. అడిగినంత ఇవ్వకపోతే వ్యాపారస్తులు తమ బండ్లు ఎక్కడ వారి షాపు ముందర పెట్టండి వారు అడిగినంత ఇవ్వక తప్పని దుస్థితిలో చిరు వ్యాపారులు ఉన్నారు.

ఇప్పటికే బడా వ్యాపారస్తులు నగర పంచాయతీ స్థలాన్ని సైతం ఆక్రమించుకొని వారి భవనాలను నిర్మించుకొని ఉన్నారు. కొత్తగా వచ్చిన నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వం చెన్నూరు రోడ్డుకు సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయడంతో కొన్ని ఆక్రమణలను తొలగించారు. ఆక్రమం తొలగించిన ప్రాంతంలో కాలువల నిర్మాణాలు చేపట్టారు. అయితే దుకాణాలు యజమానులు పాలు వల్ల సైతం ఆక్రమించుకొని తమ వ్యాపార సముదాయాలను పెంచుకునే పనిలో పడ్డారు. ఒక తట్టు వారి స్థలాన్ని పెంచుకుంటూ మరోపక్క వారి దుకాణాల ముందర పెట్టుకున్న తోపుడు బండ్ల నుండి భారీ ఎత్తున వసూలు చేసుకుంటూ అందిన కాడికి దండుకుంటున్నారు. అధికారులకు చెప్పకోలేక సాయం చేసేవారు లేక చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషనే సరిగా జరగని చిరు వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేయడంపై స్థానిక ప్రజలు దుకాణాల యజమానుల తీరుపై పెదవిరుస్తున్నారు. దీనిపై నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి విచారణ జరిపి తోపుడుబండ్లకు వ్యాపారం చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించి బడా వ్యాపారస్తులు ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement