Thursday, October 3, 2024

కూరగాయల వ్యాపారి ఇంట్లో బంగారం చోరీ

చేజర్ల, మే 9 (ప్రభ న్యూస్): ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో దాచి పెట్టిన వివిధ రకాల 20 తులాల బంగారు ఆభరణాలు చోరీ జరిగిన సంఘటన మండలంలోని ఆదూరుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదూరుపల్లికి చెందిన గొట్టం గురవయ్య బస్టాండ్ సెంటర్ లో కూరగాయలు, పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. రోజులాగే ఇంటికి తాళం వేసి కూరగాయల అంగడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూస్తే సుమారు ఇరవై తులాల‌ బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారని తెలిపారు. వేసిన తాళాలు వేసినట్టే ఉండటంతో తెలిసిన వారే ఈ పనికి పూనుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీపై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా సంగం సీఐ రవి నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన ఇంటి ప‌రిస‌రాల‌ను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై మరిడి నాయుడు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement