Tuesday, April 23, 2024

నిలువు దోపిడీకి గురవుతున్న రైతులు పట్టించుకోని అధికారులు…

కొండాపురం మండల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది ఈ ఏడాది కష్టపడి అప్పులు చేసి పండించిన ధాన్యాన్ని కొనే నాథుడే లేక నానా అవస్థలు పడుతూ దళారుల చేతుల్లో పెట్టి మోసపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి గత ప్రభుత్వంలో అంతో ఎంతో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు గత రెండు సంవత్సరాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటాం అంటున్నారు కానీ ఎక్కడ సక్రమంగా కొన్న దాఖలాలు కనిపించడం లేదు పేరుకే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు కానీ రైతులకు మాత్రం ఎలాంటి లబ్ధి చేకూరడం లేదని రైతులు వాపోతున్నారు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తుందని ధాన్యాన్ని మిల్లర్లకు పంపిస్తుంటే అక్కడ మాత్రం దొరికింది దోచుకునే విధంగా ఒక్కో బస్తా కి ఐదు కిలోలు తరుగు తగ్గిస్తే కొంటామని మెలికలు పెడుతున్నారు రైతులు ఏమి చేయాలో అర్థం కాక దాన్యం వెనక్కి తీసుకురాలేక మిల్లర్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా వారు చెప్పినట్లు ఇచ్చి వస్తున్నారు ప్రైవేటు దళారులకు అమ్ము కొందామంటే ప్రైవేట్ దళారులు మాత్రం ఇది అలుసుగా తీసుకొని రేటు వారు చెప్పినంత ఇస్తే కొంటున్నారు లేకపోతే మెలికలు పెడుతున్నారు రైతులు ధాన్యాన్ని ఇంట్లో పెట్టుకోలేక తగ్గించి దళారులకు ఇవ్వలేక నానా అవస్థలు పడుతూ నరక యాతన పడుతూ చివరకు దళారులు చెప్పిన రేటుకు ఇచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోలు చేసే విషయంలో విఫలమైందని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రైతుల బాధలు గమనించి రైతులు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్ల తో సంప్రదింపులు జరిపి రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని మరి కొందరు రైతులు అంటున్నారు గరిమెనపెంట సొసైటీ పరిధిలో కొన్ని వేల ఎకరాల వరకు వరి సాగు చేపట్టారు ఇప్పటివరకు ఒక లారీ కూడా ధాన్యాన్ని ఇక్కడ నుంచి కొనుగోలు చేసిన దాఖలాలు కనిపించడం లేదంటున్నారు అది ఏమని అడిగితే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ ఒక బస్తా కు మూడు కేజీలు తరుగిస్తే మిల్లర్లు మెలికలు పెట్టకుండా కొంటారని అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసం అంటున్నారు రైతులు అప్పులు చేసి ఒక్కో ఎకరాకు సుమారు 30 వేలు ఖర్చు పెట్టి కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఏ దారి కనిపించక రైతుల కంట కన్నీరే కనిపిస్తుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement