Saturday, April 20, 2024

‘గడపగడపకు మన ప్రభుత్వం’కు బ్రహ్మరథం

బుచ్చిరెడ్డిపాలెం : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి అనేకమంది తెలుగు దేశం పార్టీ నాయకులు వైఎస్సార్ పార్టీలో చేరేందుకు ముందుకొస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని సాల్మన్ పురం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధికి సంబంధించి పత్రాలు అందజేశారు. గ్రామంలో ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మానందం పట్టారు. గ్రామంలోని పలు సమస్యలను గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నో ఏళ్లగా గ్రామంలో స్మశాన వాటిక లేనట్లు ఎమ్మెల్యే ప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ.. గ్రామానికి సంబంధించి స్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఏళ్ల తరబడి సమస్య ఉన్న పరిష్కరించే నాధుడే లేకుండా పోయాడు అన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ట్రస్ట్ ద్వారా నాలుగు లక్షల రూపాయలు అందించడం జరిగిందని మరింత సాయం అందించేందుకు కృషి చేస్తామన్నారు. దాతల సైతం ముందుకు వచ్చి స్మశాన వాటిక ఏర్పాటు చేసుకునేందుకు గ్రామస్తులు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి అనేకమంది వివిధ పార్టీల నాయకులు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు అన్నారు. అభివృద్ధికి ఆకర్షితులై కష్టపడే తత్వం ఉన్న ప్రతి ఒక్కరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం చెందిన సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి మరో వంద మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఓ మహిళ పసిపిల్లలతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండడాన్ని గుర్తించిన ఆయన వెంటనే ఆమెకు ఇళ్ల స్థలాన్ని మంజూరు చేసి హౌసింగ్ అధికారులను వెంటనే నిర్మాణం ప్రారంభించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ప్రసన్న స్మశాన నిర్మాణానికి మహిళకు చేసిన సాయానికి వైసీపీ నాయకులు సాల్మన్పురం సన్నపురెడ్డి నరసింహారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల అధ్యక్షులు చేర్లో సతీష్ రెడ్డి, పెనుబల్లి సర్పంచి పెంచలయ్య, జొన్నవాడ ప్రసాద్, కోవూరు మురళి, వెంకయ్య, కౌన్సిలర్ చీర్ల ప్రసాద్, డాక్టర్ అల్లా బక్షు, జొన్నవాడ మాజీ సర్పంచ్ మురళి, ఎంపీపీ శ్రీనివాసులు, ఉప ఎంపీపీ బాల, ఎంపీడీవో నరసింహారావు ఇన్చార్జి దాసిల్దార్ పద్మజా వెలుగు అధికారి లలిత రెడ్డి ఆర్ ఐ సుధా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement