Thursday, June 1, 2023

మహిళ దారుణ హత్య

నెల్లూరు జిల్లాలోని జలదంకి గ్రామం శివారు ప్రాంతంలో ఒంటరి మహిళ దారుణ హత్య కు గురైంది. మానేడి కొండమ్మ (72) అనే వృద్ధిరాలిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కరెంట్ కార్యాలయం పక్కన చిన్న చిల్లర దుకాణం నిర్వహిస్తూ కొండమ్మ జీవనం సాగిస్తోంది. ఆమెను హత్య చేసి.. వంటి మీద ఉన్న బంగారం ఎత్తుకెళ్లినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో విచారణ చేపట్టారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement