Friday, April 19, 2024

తిరుమ‌ల‌ లడ్డూకు ప్రకృతి శనగలు.. అదృష్టంగా భావిస్తున్న రైతులు

ప్రొద్దుటూరు, ప్రభ న్యూస్‌ : పకృతి వ్యవసాయం ద్వారా తాము పండించిన శనగలను తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించడంపై రైతులు అదృష్టంగా భావిస్తున్నారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన శనగలను ప్రొద్దుటూరులోని మార్కెట్‌ యార్డ్‌లో నిల్వ ఉంచారు ఆ శెనగలను మంగళవారం ప్రొద్దుటూరు మార్కెట్‌ యార్డు నుంచి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని మిల్లు కు తరలించారు. అక్కడినుంచి తిరుమలకు తరలించి అక్కడ లడ్డూ ప్రసాదానికి వినియోగిస్తారు. ప్రొద్దుటూరు రూరల్‌ మండలంలోని కాకి రేని పల్లె చౌడూరు నక్కల దిన్నె రాజుపాళెం మండలంలోని సోమాపురం గ్రామాలకు చెందినరైతుల వద్ద నుంచి 272 క్వింటాళ్ల శనగలను సేకరించారు.

ఆయా గ్రామాల్లో ఎంపిక చేసిన రైతులను పకృతి వ్యవసాయ సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో శనగ పంట సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించారు. ప్రస్తుతం ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసే శనగధరల కన్నా పకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగల కు 10 శాతం అదనంగా క్వింటాల్‌ శనగలు రూ 5753 తో కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో పకృతి వ్యవసాయం అధికారులు లక్ష్మి, చైతన్య, సందీప్‌, రవీందర్‌ గౌడ్‌, చంద్ర వెంకటేష్‌, సురేష్‌ కుమార్‌తోపాటు- ప్రొద్దుటూరు డివిజన్‌ పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement