Saturday, April 20, 2024

వ్యవస్థల విధ్వంసానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్: లోకేష్

ఏపీ సీఎం వైస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. వ్యవస్థల విధ్వంసానికి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటేస్తే గ్రామాల రూపు రేఖలు మారుస్తానన్న సీఎం జగన్.. ఇప్పుడు ఏకంగా పంచాయతీల ఖాతాల్లో ఉన్న సొమ్మును కాజేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఖండిస్తున్నామన్నారు. 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల నుంచి విద్యుత్ బకాయిలంటూ రూ.345 కోట్లు కట్ చేశారని, 15వ ఆర్థిక సంఘం కేటాయించిన రూ.965 కోట్లనూ పక్కదారి పట్టించారని ఆరోపించారు. అది గ్రామీణ ప్రజలకు తీరని అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సర్పంచులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న తరుణంలో.. ఖాతాల నుంచి సొమ్మును తీసేసుకుంటే వారు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే పంచాయతీల సొమ్మును ఖాతాల్లో వేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement