Tuesday, March 26, 2024

నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా?: పోలీసులపై నారా లోకేష్ ఫైర్

విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన ‘ఛలో తాడేపల్లి’కి పోలీస్ కు అనుమతి నిరాకరించడం పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారులు వైసీపీ బానిసలుగా బతుకుతున్నారని ఆరోపించారు. నిరసన తెలిపే హక్కును ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం కల్పించిందని, దాన్ని కాలరాసే హక్కును పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, రాజారెడ్డి రాజ్యాంగానికి సలామ్ కొడుతున్నారని లోకేశ్ విమర్శించారు.

“ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల19న ఛలో తాడేపల్లి కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోగా, గుంటూరు ఎస్పీ స్వయంగా నిరుద్యోగ యువతను బెదిరించేలా మాట్లాడారు. కేసులు పెట్టి భవిష్యత్తు దెబ్బతీస్తామని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనకు ఇదే నిదర్శనం. సీఎం నివాసం వద్ద శాశ్వతంగా 144 సెక్షన్ అమలు చేయడం ఒక తప్పయితే, అసలు అక్కడ నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదనడం ద్వారా పోలీసులు మరో పెద్ద తప్పు చేస్తున్నారు. వైసీపీ కండువా కప్పుకున్నట్టుగా జగన్ కు గులాంగిరీ చేస్తున్న అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోకతప్పదు. నిరుద్యోగులను కాపాడ్డానికి అంబేద్కర్ రాజ్యాంగం ఉందని గుర్తుంచుకోండి” అంటూ లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement