Tuesday, May 30, 2023

పరిశ్రమలపై నారా లోకేష్ అనవసర విమర్శలు : మంత్రి రోజా

రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలపై, ప్రభుత్వంపై నారా లోకేష్ అనవసర విమర్శలు చేస్తున్నారని ఏపీ సాంస్కృతికశా‌ఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఈరోజు తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమ పార్టీయే గెలుస్తుందన్నారు. జగనే ముఖ్యమంత్రి అవుతారని జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని చెప్పారు.

- Advertisement -
   

ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై, తమ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్న నారా లోకేష్‌కు అభివృద్ధి కనపడటం లేదంటే ఆయన నేత్ర వైద్యుడ్నిసంప్రదిస్తే మంచిదని మంత్రి రోజా సలహా ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికల హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అన్ని సర్వేలు చెప్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అంబానీ, అదానీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుండగా.. టీడీపీ మాత్రం ప్రజల మనసుల్ని దోచుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లే పనిలో నిమగ్నమై ఉన్నదని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement