Friday, April 19, 2024

AP: నారాయణ అరెస్టును ఖండించిన నారా లోకేష్

వైసీపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ పై మండిపడ్డారు. చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులని చెయ్యడం జగన్ అండ్ కో ట్రేడ్ మార్క్ అని వ్యాఖ్యానించారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సిఎం జగన్ రెడ్డి విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారని అన్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి, టిడిపి నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. సంబంధం లేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసిపి నేతల్ని వదిలేసి టిడిపి నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదు సిఎం గారు అంటూ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement