Thursday, April 25, 2024

National Youth Day: పరిశ్రమలు రావు.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాదు.. మార్పు కోసం లోకేష్ పిలుపు

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. జాతీయ యువజనోత్సవ దినం సందర్భంగా లోకేష్‌ యువతకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అని వివేకానంద స్వామి చెప్పారని గుర్తు చేశారు. కానీ ఏపీలో యువత అడుగడుగునా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉందన్నారు.”జాబ్ కాలెండర్ రాదు. పరిశ్రమలు రావు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కావు. విదేశీ విద్యకు సాయం లేద” అని విమర్శించారు. యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వైసీసీ ప్రభుత్వానికి యువతరమే బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుందని హెచ్చరించారు. అప్పుడు నిజమైన యువజనోత్సవాలను ఘనంగా చేసుకుందాం అని, అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దాం అని లోకేష్ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement