Thursday, April 25, 2024

ఏసీబీ వలకు చిక్కిన ఎమ్మార్వో, వీఆర్వో

ఎస్ఆర్ పురం (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : ఒక రైతు పొలం యాజమాన్య హక్కును మార్చే విషయంలో ఒక ఎమ్మార్వో, వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కిన సంఘటన మంగళవారం చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలంలో చోటు చేసుకుంది. ఏసీబీ అధికారుల కథ‌నం ప్రకారం మండలానికి చెందిన లక్ష్మణ రెడ్డి అనే రైతు తన తండ్రి పేరున ఉన్న పొలం హక్కును తన పేరుకు మార్చుకోడానికి ఎమ్మార్వో షబ్బర్ బాషా ను కలిశారు.

ఆ క్రమంలో చిన్న తయ్యూరు వీఆర్వో గోవిందరెడ్డి ద్వారా రూ.60 వేలు లంచంగా తీసుకోడానికి ఒప్పించారు. ఈ విషయం తెలిసిన ఏసీబీ అధికారులు వల పన్ని లక్ష్మణ రెడ్డి ద్వారా రూ.20 వేలు పంపించారు. ఆ సొమ్ము ఎమ్మార్వో, వీఆర్వో లు తీసుకుంటుండ‌గా.. దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరినీ పట్టుకున్నట్టు ఏసీబీ అధికారి జనార్ధన నాయుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement