Saturday, June 12, 2021

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రఘురామ లేఖ

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు. సెక్షన్ 124ఏ రద్దుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు పార్లమెంటులో డిమాండ్ చేయాలని లేఖలో కోరారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి ఓ ఎంపీని 124ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసి, చిత్రహింసలు పెట్టారని తెలిపారు. మే 14న తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు క్రూరంగా హింసించారని ఆరోపించారు. సెక్షన్ 124ఏను రద్దు చేసేందుకు పూర్తి మద్దతు ఇవ్వాలని రఘురామ విజ్ఞప్తి చేశారు.

కాగా, రాజద్రోహం కేసులో అరెస్టు అయిన రమురామ గత నెలలో బెయిల్ పై విడుదల అయ్యారు. మీడియా సమావేశాలు నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో మరో పంథాలో పోరాటాన్ని సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు. అంతేకాదు సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా కేంద్రానికి రఘురామ ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News