Saturday, April 20, 2024

సీఎం జగన్ కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ..!

ఏపీ సీఎం జగన్కి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో CPS రద్దు చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు కాని మీరు అధికారంలోకి వచ్చి 765 రోజులు గడిచిన హామీ నిలబెట్టుకోలేదుని లేఖలో పేర్కొన్నారు. ఇక ఈ నెల నుండి వృద్ధాప్య పింఛన్లను 2,750 రూపాయలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఏడాది గా ఉన్న పెండింగ్ పింఛను మూడు వేల రూపాయలను కూడా కలిపి ఇవ్వాలి అంటూ లేఖ లో సీఎం జగన్ ను కోరారు. అయితే ఎన్నికల సమయం లో వైసీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు. అయితే రెండు వేల నుండి మూడు వేలకు పెంచుతాం అని హామీ ఇవ్వడం ద్వారానే వైసీపీ కి ప్రజల నుండి పూర్తి మద్దతు వచ్చింది అంటూ లేఖలో వివరించారు. అయితే దీనికి వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement