Wednesday, December 11, 2024

కడపలో ప్రజాద‌ర్బార్.. పాల్గొన్న ఎంపీ అవినాష్ రెడ్డి

కడప, బ్యూరో,ప్రభన్యూస్.. వివేకా హత్యకేసు లో ఆరోపణలు,విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి రెండో రోజు కడపలో ప్రజా దర్బార్ నిర్వహించారు . హైదరాబాద్ నుండి పులివెందుల చేరుకొని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ నియోజకవర్గ కార్యకర్తలు,శ్రేణులతో ప్రజా దర్బార్ నిర్వహించిన అవినాష్ రెడ్డి బుధవారం కడపలో ఇదే కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం పదిన్నర గంటలకే కడప రోడ్లు భవనాల శాఖ అతిధిగృహానికి చేరుకున్నారు. ఆయనతోపాటు నాయకులు అతిథి గృహానికి
వచ్చారు.ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, నగర మేయర్ సురేష్ బాబు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు
రాంప్రసాద్ రెడ్డి, వ్యవసాయ శాఖ రాష్ట్ర సలహాదారుడు తిరుపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైసిపి పార్టీ నగర ఇంచార్జి సుబ్బారెడ్డి , వైసిపి నాయకులు ఐస్ క్రీమ్ రవి, మాసీమ బాబు, వెంకటసుబ్బమ్మ, సుభాన్ భాష తదితరులతోపాటు కార్పొరేటర్లు ,ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన్ను కలిసిన నాయకులు, కార్యకర్తలను క‌లిసి అవినాష్ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం వాటి పరిష్కారానికి హామీ ఇవ్వడంతో పాటు సిఫార్సులు చేశారు. అవినాష్ ను కోర్టు తీర్పును బట్టి నేడో రేపో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆయన రెండో రోజూ ప్రజా దర్బార్ నిర్వహించడం ,ఈ కార్యక్రమానికి వైసిపి అనుచరులు పెద్ద ఎత్తున హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కడపలో ఆయన సాయంత్రం మూడు గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహించ నున్నట్లు స్థానిక నేతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement