Friday, April 26, 2024

KNL: త‌ల్లితో క‌ల‌సి హైద‌రాబాద్ కు ఎంపీ అవినాష్ రెడ్డి

కడప ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం తల్లితో పాటు కర్నూలు నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. తన తల్లి లక్ష్మమ్మ అనారోగ్య రీత్యా గత ఆరు రోజులుగా కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాష్ రెడ్డి ఉంటున్న సంగతి విధితమే. ఈ క్రమంలో మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రశ్నించే నిమిత్తం సిబిఐ ఆయనను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. దీంతో కర్నూలులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి విధితమే. ఇదే సమయంలో వైసీపీ శ్రేణులు అవినాష్ కు అండగా ఉంటూ విశ్వభారతి హాస్పిటల్ ఎదురుగా మొహరించాయి. శాంతి భద్రతల నేపథ్యంలో స్థానిక పోలీసులు సహకరించక పోవడంతో సిబిఐ బృందం వెనుతిరగాల్సి వచ్చింది.

ఇదే సమయంలో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును హైకోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశించింది. వాస్తవంగా గురువారం వీటిపై విచారణ జరగాల్సి ఉండగా, శుక్రవారంకు వాయిదా పడింది. ఇదే సమయంలో అవినాష్ తల్లి ఆరోగ్యం మెరుగుపడంతో ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు తల్లితో కలిసి శుక్రవారం ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తన తల్లికి మెరుగైన వైద్యం అందించాలని కర్నూలు ప్రజలు అనునిత్యం ప్రార్థించారని, కర్నూలు ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వెంట కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement