Friday, March 29, 2024

Movie: ‘అలా వ‌స్తే బాగుండు’.. నెట్టింట వైర‌ల్ అవుతున్న పునీత్ వీడియో..

Puneeth Rajkumar: మ‌న మ‌న‌స్సుకు న‌చ్చిన వాళ్లు అక‌స్మాత్తుగా చ‌నిపోతే.. ఆ బాధ ఎట్లుంట‌దో చెప్ప‌న‌ల‌వి కాదు. ఒక్కోసారి వాళ్లు క‌ల‌లో అలా అక‌స్మాత్తుగా వ‌చ్చి ప‌ల‌క‌రించిన‌ట్టు కూడా అనిపిస్తుంటుంది. మెల‌కువ వ‌చ్చిన త‌ర్వాత అట్లాంటి భావ‌న మ‌రింత బాధ క‌లిగిస్తుంది. అయితే ఇప్పుడు పునీత్ రాజ్‌కుమార్ మీద లక్ష‌లాది మంది క‌న్న‌డ ప్ర‌జ‌ల్లో ఇట్లాంటి ఫీలింగే ఉంది..

పునీత్ అంటే చాలా మందికి ప్రేమ‌, అభిమానం. అ అభిమాన‌మే ఇప్పుడు వారిని కంట‌త‌డి పెట్టిస్తోంది. అయితే.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు క‌ర్నాట‌క‌తో పాటు ఏపీ, తెలంగాణ‌లోనూ వైర‌ల్ అవుతున్నాయి. అందులో ఒక‌టి త‌ను విధి రాత గురించి చెబుతున్నది కాగా.. మ‌రోటి మూవీ ప్ర‌మోష‌న్‌కు సంబంధించింది.

కాస్త ముందూ వెన‌కా అంద‌రూ పోతారు. ఏం తిన్నాం, ఏం సంపాదించాం అనేది న‌థింగ్‌, విధి రాసిన‌ట్టు జ‌రుగుతుంది అని పునీత్ రాజ్‌కుమార్ చెబుతున్న వీడియో పాటు.. మ‌రో వీడియో కూడా ఉంది.. యువ‌ర‌త్న‌మూవీ ప్ర‌మోష‌న్ లో భాగంగా ఈ వీడియో చేశారు. (ఓటీటీల్లోనూ ఈ మూవీ రిలైజైంది.)

ఈ వీడియోలో కొంద‌రు న‌టీ న‌టుల గురించి వారి అభిమానులు అనుభ‌వాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. దాంట్లో క‌ర్టెన్ వెన‌కు నుంచి అనుకోకుండా పునీత్ వ‌చ్చి వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటాడు. మాట్లాడుతూనే అటువైపు తిరిగే స‌రికి ఎదురుగా పునీత్ ఉండ‌డంతో ఒక్క‌సారిగా వారు షాక్ కు గుర‌వుతారు. అంత‌లోనే పునీత్ వారిని అభినందిస్తూ.. గుండెల‌కు హ‌త్తుకుంటాడు. ఇట్లాగే పునీత్ తిరిగొస్తే బాగుండు అని.. ఈ వీడియోను మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు జ‌నం.. దీంతో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement