Saturday, April 20, 2024

Study: యంగ్​ ఏజ్​లోనే పెళ్లిళ్లు.. టాప్​-1లో ఏపీ​, ఆ తర్వాత తెలంగాణ.. సర్వేలో ఏం తేలిందంటే!

చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేయడం.. యంగ్​ ఏజ్​ పిల్లలను అత్తారింటికి పంపి తమ గుండెలమీద కుంపటిలా మారిన పరిస్థితులను తప్పించుకున్నామని చాలామంది పేరెంట్స్​ ఫీలువుతుంటారు. కానీ, ఇది వారి పిల్లల జీవితాల్లో ఎన్నో ఇబ్బందులను, మరెన్నో సవాళ్లను తెస్తుందని విషయాన్ని తల్లిదండ్రులు గమనించడం లేదు. చదువుకోవాల్సిన వయసులో పెళ్లి చేయడమే కాకుండా వారి వైవాహిక జీవితాల్లో సరైన సమయంలో పొందాల్సిన మధురానుభూతులను కోల్పోయేలా చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది.  

అయితే.. చిన్న వయస్సులోనే పెళ్లిళ్లు చేసే అంశంపై దేశవ్యాప్తంగా జరిపిన ఓ సర్వేలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​ టాప్​ 1లో నిలుస్తోంది. ఏపీలో ఎక్కువగా చిన్న వయస్సులోనే అమ్మాయిలకు పెళ్లి తంతు ముగించేసి, తల్లిదండ్రులు వారిని అత్తారింటికి పంపేస్తున్నరన్నది సర్వేలో వెల్లడయ్యింది.  జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ఈ వివరాలు తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా, కేరళ రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-) 2019 జులై 5వ తేదీ నుంచి నవంబర్​ 14వ తేదీ వరకు ఈ సర్వే జరిపింది. దాదాపు పలు రాష్ట్రాల్లోని 11,346  ఇండ్లను ఈ సర్వే బృందం కవర్ చేసింది. NFHS-4లో 33%తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ వయస్సు గల వివాహాల రేటు 29.3%కి తగ్గింది. అయినప్పటికీ దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఇది ఇప్పటికీ అత్యధికం. చాలామంది18 సంవత్సరాలు నిండకముందే వివాహం చేసుకున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.

సర్వే ప్రకారం.. ఏపీలోని కొన్ని జిల్లాలు NFHS-4తో పోలిస్తే NFHS-5లో బాల్య వివాహాల శాతం పెరిగినట్లు తెలుస్తోంది. 15-19 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఇప్పటికే తల్లులుగా మారిన అనేక కేసులను కూడా సర్వేలో వెలుగుచూసింది. అంతేకాకుండా కొవిడ్ -19 మహమ్మారితో కూడా రాష్ట్రంలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని.. అప్పటి పరిస్థితులు దీనికి దారితీశాయని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) అధికారులు తెలిపారు. అనంతపురం, ప్రకాశం జిల్లాలు 37.3%తో అత్యధికంగా తక్కువ వయస్సు గల వివాహాల రేటును నమోదు చేయగా.. కర్నూలు 36.9%తో రెండో స్థానంలో ఉంది. 23.5% తక్కువ వయస్సు గల వివాహాల రేటుతో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. కర్నాటక 21.3%తో మూడో స్థానంలో..తమిళనాడు 12.8%తో నాలుగో స్థానంలో ఉన్నాయి.  కేరళ అతి తక్కువగా 6.3% మాత్రమే చిన్నారుల పెళ్లిళ్లు జరిగినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement