Thursday, March 23, 2023

అనిత మాటలు మార్ఫింగ్ – సజ్జల కుమారుడిపై ఫిర్యాదు

తన వ్యాఖ్యలను భార్గవ్ రెడ్డి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత మండిప‌డ్డారు. ఈ మేర‌కు వైసీపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డిపై విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు అనిత ఫిర్యాదు చేశారు. చంద్రబాబును గద్దె దింపాలని, జగన్ ను సీఎం చేయాలని తాను అనలేదన్నారు. ఎడిటింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారన్నారు. మహిళా దినోత్సవం రోజున ఈ మార్ఫింగ్ వీడియోను వైసీపీ అనుకూల ఛానల్ లో ప్రసారం చేశారని మండిప‌డ్డారు. తమపై వైసీపీ శ్రేణులు ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్ చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement