Tuesday, November 5, 2024

Modi 3.0 – న‌ర్సాపురం బిజెపి ఎంపి శ్రీనివాసవర్మకి కేంద్ర మంత్రి ప‌ద‌వి..

మోదీ కేబినెట్ లో ఎపి, తెలంగాణ నుంచి అయిదుగురు…

ఢిల్లీ – మోదీ 3.0 కేంద్ర కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఛాన్స్ ద‌క్కింది.. ఇందులో ఏపీ నుంచి టిడిపికి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉండ‌గా, తొలిసారి బిజెపి అభ్య‌ర్ధిగా నరసాపురం నుంచి విజ‌యం సాధించిన శ్రీనివాసవర్మ కూడా మోదీ త‌న మంత్రి వ‌ర్గంలో స్థానం క‌ల్పించారు. ఇక తెలంగాణ నుంచి కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ లు మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు..

పురందేశ్వరికి నో ఛాన్స్..

మోదీ తన మార్క్ రాజకీయం ఏంటో మరో సారి నిరూపించారు. ఏపీలోనూ తన మాటే నెగ్గేలా చేసుకున్నారు. బీజేపీ నుంచి పురందేశ్వరిని కాదని…అనూహ్యంగా శ్రీనివాస వర్మను మోదీ తన కేబినెట్ లోకి ఎంపిక చేసుకున్నారు.

- Advertisement -

ఏపీ బీజేపీ నుంచి నుంచి అందరూ పురందేశ్వరికి ఛాన్స్ దక్కుతుందని అంచనా వేయగా, అనూహ్యంగా నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి కంటే పార్టీలో సామాన్య కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని మోదీ నిర్ణయించారు.శ్రీనివాస వర్మ ఎంపిక వెనుకదాదాపు 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్న శ్రీనివాస వర్మ పార్టీ టికెట్ ఎంత అనూహ్యంగా దక్కించుకున్నారో…ఇప్పుడు అంతకంటే పార్టీలో ఆశావాహులకు షాక్ ఇస్తూ కేంద్ర మంత్రి అవుతున్నారు.

విస్తరణలో జన సేనకు ఛాన్స్

ఏపీలో టీడీపీతో పొత్తు వేళ గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని మోదీ తన మార్క్ రాజకీయం ఏపీలో అమలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అదే సమయంలో జనసేనకు ఛాన్స్ దక్కలేదు. మోదీ మార్క్ రాజకీయంకేంద్ర మంత్రివర్గ విస్తరణలో జనసేనకు ఛాన్స్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది.

సీఎం రమేష్ ఆశలు గల్లంతు

అదే విధంగా బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ సైతం కేంద్రంలో మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్నారు. కానీ, వీరి రాజకీయ నేపథ్యం కారణంగానే ప్రధాని ఆచి తూచి శ్రీనివాస వర్మ ను ఎంపిక చేసారనేది స్పష్టం అవుతోంది. విస్తరణ సమయం నాటికి రాజకీయంగా చోటు చేసుకొనే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే, పురందేశ్వరి పేరు స్పీకర్ గా పరిశీలనలో ఉందని మద్దతు దారులు ప్రచారం ప్రారంభించారు. కేంద్రంలో ప్రతిపక్షం గతం కంటే ఈ సారి బలంగా ఉన్న పరిస్థితుల్లో పురందేశ్వరికి అవకాశం కష్టమనే వాదన ఉంది. దీంతో..మోదీ మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నా..తన మార్క్ రాజకీయం మాత్రం కొనసాగిస్తున్నారు.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement