Sunday, January 16, 2022

టాలీవుడ్ కు ఏపీ సీఎం తెలుసా ?.. చంద్రబాబుకే హీరోల సపోర్ట్!

సినీ పరిశ్రమకు చెందిన హీరోలకు ఆంధ్రప్రదేశ్ లో ఓ ముఖ్య మంత్రి ఉన్నాడన్న విషయం తెలుసా అని కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి  ప్రశ్నించారు. సోమవారం ఆయన బుచ్చిరెడ్డిపాలెంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ సినీ హీరోలు సినిమాలు తీసుకుంటూ కోట్లు ఘటిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆరోపించారు. గతంలో పాలించిన పాలకులు ఎవరు సినిమా వారిని ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియనట్లు సినీ పరిశ్రమ ప్రముఖులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే ఎవరో తెలియజేస్తామని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది సినీ పరిశ్రమలో ఉండడంతో చూసి చూడనట్టు పరిశ్రమను వదిలేశారని వ్యాఖ్యానించారు. తాము అలాకాకుండా పేదల పక్షాన నిలబడుతామన్నారు. సినిమా థియేటర్లు రూ.100, రూ.1000, రూ.1500 రూపాయలకు టిక్కెట్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇకపై అలా జరగనీయమన్నారు. సినిమాను అందరికీ అందుబాటులోకి తెస్తామన్నారు. వసతులు లేని, అనుమతి లేని థియేటర్లపై చర్యలు తీసుకోవడంలో తప్పేమిటని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News