Saturday, April 20, 2024

Flash: లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే కేతిరెడ్డి

భాకరాపేట ఘాట్ రోడ్ బస్సు ప్రమాదం ఘటనలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా సిమ్స్ బర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.  తన అనుచరులతో కలిసి షూస్ ఆస్పత్రికి ఆయన.. లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కు వెళ్లేందుకు ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఎక్కారు. అయితే, లిఫ్టు ఓవర్ లోడ్ కావడంతో ఎటు కదలలేక లాక్ పడిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్న వారంతా కొద్దిసేపు ఊపిరాడక భయాందోళనలకు చెందారు. స్విమ్స్ హాస్పిటల్ లిఫ్ట్ నిర్వాహకులు రావడం ఆలస్యం కావడంతో లిఫ్ట్ లో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు వెంటనే లిఫ్ట్ డోర్ లను తొలగించారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. లిఫ్ట్ను గట్టిగా తోయడంతో స్ట్రక్ అయింది. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులు రెండో ఫ్లోర్ కు నడుచుకుంటూ వెళ్లి తమ నియోజకవర్గానికి చెందిన క్షతగాత్రులను పరామర్శించి ప్రభుత్వం తరఫున పరిహారాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement