Saturday, December 7, 2024

నాడు- నేడు అంటే భవనాలను కూల్చడమేనా?

జగన్ సర్కార్ అమలు చేస్తున్న నాడు – నేడు అంటే ఉన్న భవనాలు కూల్చడమేనా? అని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ప్రశ్నించారు. సింగరాయ కొండ బాలయోగి బాలికల సాంఘిక గురుకుల పాఠశాలలో బాగున్న పాత అడ్మినిస్టేటివ్ భవనం కూల్చివేసి మెండిగోడలు మిగిల్చారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చి విధ్వంస పాలనలకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యావ్యవస్ధలో దళితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు మేనమాన అన్న జగన్.. కంసుడిలా మారారని విమర్శించారు. విద్యా వ్యవస్ధలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని పైకి చెబుతూ… రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల్లో 2000  ఇంటర్ సీట్లను రద్దు చేశారని ఆరోపించారు. గతంలో 4 జతల యూనిపామ్ ఇస్తుంటే.. 3 జతలకు కుదించారన్నారు. అమ్మఒడి పేరుతో గురుకుల పాఠశాలల్లోని విధ్యార్దులకు కాస్మోటిక్ చార్జీలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్,  ఎన్టీఆర్ విదేశీ విద్య, స్టడీ సర్కిళ్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీలకు నాణ్యమైన విధ్యను దూరం చేశారని, ఎస్సీలకు విదేశీ విద్యను అందని ద్రాక్షగా మార్చారని ఎమ్మెల్యే డోలా ఆరోపించారు.

ఇది కూడా చదవండి: మనబడి నాడు–నేడు పథకం.. విద్యార్ధులకు అంకితం చేయనున్న సీఎం

Advertisement

తాజా వార్తలు

Advertisement