Friday, December 6, 2024

జ‌గ‌న్ కోసం ఎలాంటి త్యాగాల‌కైనా సిద్ధ‌మ‌న్న‌ ఎమ్మెల్యే భూమ‌న

జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లప్పుడూ ఉండడానికి కార్యకర్తలుగా మనమంతా ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పిలుపునిచ్చారు. జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర నాలుగేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో భూమన కరుణాకర రెడ్డి వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తిరుప‌తి తుడా కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. వైఎస్సాఆర్ కు ఘనంగా నివాళుల‌ర్పించారు. పార్టీ శ్రేణులతో కలిసి తుడా ఆఫీసు నుంచి నగర పాలక సంస్థ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ… భారతదేశంలోని మరెవరూ అమలు చేయనన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాల చేపట్టి… అట్టడుగు వర్గాల ప్రజల అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3648 కి.మీ. దూరం పాదయాత్ర నిర్వహించి, రెండు వేలకు పైగా బహిరంగ సభల్లో ప్రసంగించి, వందలాది సమావేశాలు నిర్వహించి, కోట్లాది మంది ప్రజలను నేరుగా కలుసుకున్నారని తెలిపారు. ఆనాటి చంద్రబాబు పాలనా విధానాలకు వ్యతిరేకంగా… ప్రజల పక్షాన నిలిచి వారి కష్టాలను గుర్తించారన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొని, వైఎస్సార్ సీపీ 151అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింద‌న్నారు. టీడీపీ 23 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. తిరుపతి నగర పాలక సంస్థ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీషా, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement