Thursday, March 28, 2024

ఈ ప్రశ్నకు బదులేది… ఇంటర్ బోర్డు తప్పులకు స్టూడెంట్స్ ఇబ్బంది

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్న పత్రం లో చిన్న పొరబాటు జరిగింది. ప్రశ్న పత్రం లో రెండు మార్కుల ప్రశ్నల్లో మూడవ ప్రశ్న లో ఇంగ్లీష్ ప్రశ్న పత్రం లో ఒకలాగా, తెలుగు ప్రశ్న పత్రం లో మరో విధంగా వచ్చింది.. ఆఖరిక్షణం లో గుర్తించిన అధికారులు పరీక్ష కేంద్రం లోనే విద్యార్థులకు తెలియ చేసే ప్రయత్నం చేసారు.

కొందరికి మాత్రమే చెప్పగలిగారు.. ఈ విషయం పై విద్యార్థులలో ఆందోళన వ్యక్తం అయింది. వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు.. ఇంగ్లీష్ ప్రశ్న పత్రం లో మూడవ ప్రశ్న కు విద్యార్థులు ఏం రాసినా రెండు మార్కులు ఇస్తామని ప్రకటించడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement