Tuesday, October 8, 2024

Punganur | చిన్నారి అదృశ్యం.. 11 బృందాలతో గాలింపు చర్యలు

పుంగనూరు, (ప్రభ న్యూస్): ఇంటిముందు ఆడుకుంటున్న ఏడు సంవత్సరాల చిన్నారి బాలిక అదృశ్యమైన ఘటన పుంగునూరు పట్టణంలో కలకలం రేపుతున్నది. పట్టణంలోని ఉబేదులా కాంపౌండ్ లో నివాసం ఉంటున్న అంజాద్ కుమార్తె అస్పియా (7) ఆదివారం రాత్రి అదృశ్యమైంది. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక హఠాత్తుగా అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతున్నది.

బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బంధువులతో కలిసి పరిసర ప్రాంతాల్లో వెతికారు. తమ బంధువుల గృహాల్లో వాకాబు చేసినా తమ కుమార్తె ఆచూకీ తెలియకపోవడంతో ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులు ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

సోమవారం ఉదయం వరకు ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాలతో డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టినా బాలిక ఆచూకీ తెలియలేదు. ఈ ఘటన రాష్ట్రస్థాయిలో కలకలం రేపుతుండగా సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు స్వయంగా పుంగనూరుకు వచ్చి బాలిక అదృశ్యంపై విచారణ చేపట్టారు. బాలిక ఆచూకీ కనిపెడతామని తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. 11 బృందాలతో బాలిక అదృశ్యంపై గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement