Monday, October 7, 2024

Breaking | బ‌స్సును త‌ప్పించ‌బోయి టిప్ప‌ర్‌కు ఢీకొట్టి.. క‌ర్నూలు జిల్లాలో ఇద్ద‌రు మృతి

గూడూరు (ప్రభ న్యూస్) : క‌ర్నూలు జిల్లాలోఘోరం జ‌రిగింది. గూడూరు మండలంలోని కే నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధి సల్కాపురం ద‌గ్గ‌ర యాక్సిడెంట్ జ‌రిగింది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైకుపై కర్నూలు నుండి సల్కాపురం వస్తుండగా.. నెరవాడ రోడ్డు దగ్గర బస్సు ఎదురుగా వస్తున్నడంతో తప్పించబోయి ఇసుక టిప్పర్ తగిలి అక్కడికక్కడే చ‌నిపోయిన‌ట్టు కే నాగలాపురం పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. యాక్సిడెంట్‌లో కురువ సుధాకర్ కుమారుడు కురవ వంశి (21), అదే గ్రామానికి చెందిన కురువ శివన్న కుమారుడు కురువ మధు (42) అక్కడికక్కడే చ‌నిపోయారు. ఈ మేరకు కే నాగలాపురం ఎస్ఐ సోమ్లా నాయక్ కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement