Tuesday, October 8, 2024

AP: పిడుగు బాధితులకు పరిహారం అంద‌జేసిన మంత్రి స‌విత..

శ్రీ సత్యసాయి బ్యూరో, సెప్టెంబర్ 30 (ప్రభ న్యూస్): పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో పిడుగుపడి మృతిచెందిన గిరిజన దంపతుల కుటుంబ సభ్యులకు ఇవాళ‌ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ప్రభుత్వం తరఫున పరిహారం పంపిణీ చేశారు.

ఇదే దుర్ఘటనలో గాయపడిన గిరిజన దంపతుల కుమారుడు జగదీష్ నాయక్ కు ఎనిమిది లక్షల 75 వేల రూపాయల చెక్కును అందజేశారు. పిడుగు పడిన దుర్ఘటనలో దశరథ్ నాయక్, దేవిబాయి వీరితో పాటు రెండు పాడి ఆవులు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులకు ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున ఎనిమిది లక్షలు, అదేవిధంగా రెండు పాడి ఆవులకు గాను రూ.75000లు మొత్తం 8,75,000 చెక్కును మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి వెంట పుట్టపర్తి ఆర్డీఓ భాగ్యరేఖ, తదితరులున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement