Tuesday, April 16, 2024

ఆన్ లైన్ లో సినిమా టికెట్లు: ఎగ్జిబిటర్ల సమ్మతమే!

ఆంధ్రప్రదేశ్‌లో ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకం విధివిధానాల రూపకల్పనపై ప్రభుత్వం కరసత్తు మొదలు పెట్టింది. ఆన్‌లైన్ టిక్కెట్ విధానాన్ని ఏపీ సినీ ఎగ్జిబిట‌ర్లు స్వాగ‌తించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త విధానానికి పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తామ‌న్నారు. ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకంపై ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలతో చర్చించిన ప్రభుత్వం.. తాజాగా నిన్న ఎగ్జిబిటర్లతో సమావేశం నిర్వహించింది. మంత్రి పేర్ని నాని సినీ ఎగ్జిబిటర్లతో వరుసగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిగా ఆయన గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లతో భేటీ అయ్యారు.  మూడు జిల్లాల్లో సుమారు 300 థియేటర్లు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఆన్ లైన్ టికెట్ల విధానం, థియేటర్ల సమస్యలను ఎగ్జిబిటర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్ టిక్కెట్ విధానంపై ప్రభుత్వ నిర్ణయానికి ఎగ్జిబిటర్లు అంగీకారం తెలిపారు. ఆన్ లైన్ టికెట్ల విధానం తమకు సమ్మతమేనని చెప్పారు. అయితే, ఆన్ లైన్ లో టికెట్ల విక్రయానికి సంబంధించి కొన్ని ప్రైవేటు యాప్ లతో ఐదేళ్ల ఒప్పందం ఉందని ఎగ్జిబిటర్లు మంత్రికి చెప్పారు. అయితే, లీగల్ సమస్యలు రాకుండా సదరు యాప్ ల నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతామని మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.

మరోవైపు థియేటర్ల గ్రేడింగ్ విధానం, టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యంపై సీఎం జగన్ తో చర్చించాల్సి ఉందని మంత్రి ఎగ్జిబిటర్లతో చెప్పారు. మిగిలిన జిల్లాల ఎగ్జిబిటర్లతో కూడా సమావేశాలు నిర్వహించి ఆన్ లైన్ టికెట్ల విధానంపై ప్రకటన చేస్తామని మంత్రి పేర్కి నాని చెప్పారు.

ఇది కూడా చదవండి: Big Story: ఓసారి ఢిల్లీకి రండి.. కాంగ్రెస్ స్టేట్ లీడ‌ర్ల‌కు హై క‌మాండ్ పిలుపు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement